ఫ్రాన్స్, రష్యా ముప్పేట దాడులు
– 33 మంది మిలిటెంట్ల హతం
– ఫ్రాన్స్‌లో ఎన్‌కౌంటర్
– ముగ్గురు అనుమానితుల మృతి
పారిస్,నవంబర్18(జనంసాక్షి):
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పోలీస్ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు హతమయ్యారు. ఈనెల 13న పారిస్‌లో ఐఎస్ ఉగ్రవాదులు మారణ¬మం సృష్టించి 129 మందిని పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం, పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిస్ ఉత్తర ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానిత వ్యక్తులపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, ఓ మహిళా తీవ్రవాది ఆత్మాహుతికి పాల్పడింది. మృతుల్లో ఓ సాధారణ పౌరుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిస్ ఉగ్రదాడిలో పాల్గొన్న తొమ్మిదో ఉగ్రవాది కోసం పారిస్ శివారులో పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిషేధించారు. గత శుక్రవారం పారిస్ నగరంలో దాడిలో పాల్గొన్న తొమ్మిది మంది ఉగ్రవాదుల్లో ఎనిమిది మంది ఆరోజే మృతి చెందారు. తొమ్మిదో ఉగ్రవాదిగా భావిస్తున్న సల్లాహ్ అసదబెస్లామ్ పారిస్‌లోని సెయింట్ డెనిస్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో బుధవారం ఉదయం కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. నగర శివారులో ఉగ్రవాదుల కోసం పోలీసులు సోదాలు చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఉగ్రవాద దాడుల నిందితులు దాగి ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో ఫ్రెంచ్ పోలీస్ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. భారీ పేలుడు శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. కనీసం ఏడు పేలుళ్లు జరిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాల్పుల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. మృతుల్లో ఒకరు పారిస్ దాడుల సూత్రధారి అబ్దుల్ హవిూద్ అబౌద్ అని భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి ప్రయత్నించిన ఒక మహిళ కూడా చనిపోయింది. ఇద్దరు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పారిస్‌లో శుక్రవారం దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఫ్రాన్స్ పోలీసులు, జవానులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం చేపట్టిన ఆపరేషన్‌లో 115,000మంది పోలీసులు, జవానులు పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే సెయింట్ డెనిస్‌లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఇదిలావుంటే ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ మరువక ముందే మరో ముప్పు ఎదురైంది. రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో మంగళవారం ఎయిర్ ఫ్రాన్స్ విమానం-65 అమెరికాలోని లాస్‌ఏంజిల్స్ నుంచి పారిస్ వెళ్లాల్సి ఉండగా.. విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. తనిఖీలు నిర్వహించిన అనంతరం సాల్ట్‌లేక్ సిటీ విూదుగా విమానాన్ని దారి మళ్లించారు. మరో విమానం వాషింగ్టన్ నుంచి పారిస్ వెళ్లాల్సి ఉండగా.. దాన్ని నోవా స్కోటియా విూదుగా మళ్లించారు. రెండు విమానాలు సురక్షితంగా ఫ్రాన్స్ చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు.
ఫ్రాన్స్, రష్యా వైమానిక దాడుల్లో 33 మంది ఉగ్రవాదులు హతం
పారిస్ దాడుల సూత్రధారి హతం
ప్యారిస్‌పై ఉగ్రదాడుల తరవాత సిరియా ఉత్తర ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై ఫ్రాన్స్, రష్యాలు దాడులు ముమ్మరం చేశాయి. గత 72 గంటల్లో చేపట్టిన వైమానిక దాడుల్లో 33 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. మరో డజను మంది ఉగ్రవాదులు గాయపడినట్లు సిరియాలో బ్రిటన్‌కు చెందిన మానవహక్కుల పరిశీలన సంస్థ వెల్లడించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈనెల 13న ఉగ్రవాదులు దాడులు చేయడంతో 129 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాలపై ఫ్రాన్స్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇటీవల ఈజిప్టులో తమ విమానాన్ని కూల్చింది ఐఎస్ ఉగ్రవాదులే అని నిర్దారణ కావడంతో రష్యా కూడా ఫ్రాన్స్‌తో జతకట్టి ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడుతోంది. దీంతో ఇరుదేశాల వైమానిక దాడులతో ఐఎస్ స్థావరాలు రక్తమోడుతున్నాయి. అమెరికా అందించిన గూఢసమాచారం మేరకు దాడులు కొనసాగుతున్నాయి.
ఇదిలావుంటే నాలుగు రోజుల క్రితం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో దాడికి పాల్పడిన తొమ్మిదో ఉగ్రవాది సల్లాహ్ అరద్బెస్లామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పారిస్‌లోని సెయింట్ డెనిస్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్లో ఉగ్రవాది తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ అపార్ట్‌మెంట్ భవనంలోకి పలువురు పోలీసులు ఆయుధాలతో లోపలికి ప్రవేశించారు. ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం ఉగ్రవాది తలదాచుకున్న భవన యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గత శుక్రవారం నరమేథం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ ప్రధాని సూత్రదారి అద్బెల్ హవిూద్ అబోద్ పోలీసుల కాల్పుల్లో
చనిపోయినట్లు సమాచారం. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే అనుమానంతో ఈరోజు ఉదయం నుంచి సెయింట్ డెనిస్ ప్రాంతంలో పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లోనే సూత్రదారి అద్బెల్ కూడా మృతిచెందినట్లు సమాచారం.