ఫ్రీడమ్ రన్ తో ప్రజల్లో జాతీయ భావం వికసిస్తుంది

ఎస్ఐ గిరి
కుల్కచర్ల,ఆగస్టు11(జనం సాక్షి):
ఫ్రీడమ్ రన్ తో ప్రజల్లో జాతీయ భావం వికసిస్తుందని కుల్కచర్ల మండల ఎస్ఐ గిరి అన్నారు. గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఘనపూర్ గేట్ వరకు 2 కిలోమీటర్ల పరుగు పందెం ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని స్థానిక ఎస్ఐ గిరి ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ గిరి మాట్లాడుతూ..సర్వ మతాలకు భారతదేశం పుట్టినిల్లుగా ఉంటుందని,  భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం ప్రతిక అన్నారు. నాడు స్వతంత్ర ఉద్యమంలో స్ఫూర్తిని రగిలించడానికి ఫ్రీడమ్ రన్ లు కీలక పాత్ర వహించాయన్నారు.స్వతంత్ర సమరయోధుల త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.రెండు వారాల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వజ్రోత్సవాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం నిర్ణయించిన అన్ని కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వాములు అయ్యేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.ఫ్రీడం రన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సౌమ్య వెంకట్ రామ్ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షులు కేబి రాజు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రాంలాల్, తెరాస నాయకులు దామోదర్ రెడ్డి, కృష్ణయ్య గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ శివకుమార్ గౌడ్, కృష్ణా రెడ్డి, అంబేద్కర్,దళిత
యువజన సంఘాల నాయకులు వెంకట్ రాములు, జే వెంకటయ్య, చుక్కయ్య, దొమ్మ బాబు, పీఈటి సుభాష్ నాయక్, పోలీస్ సిబ్బంది, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.