ఫ్లోరైడ్ రక్కసిని దూరం చేసిన కేసీఆర్.. వ్యక్తిగత స్వార్థంతో ఉపఎన్నికలు.

వ్యక్తిగత స్వార్థంతో ఉపఎన్నికలు.
ఉడతలపల్లి, కోటయగుడెం గ్రామాల ఇంచార్జ్  పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు అక్టోబర్ 15(జనంసాక్షి) మునుగోడు లోని ఉడతలపల్లి, కోటయగుడెం గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రజల మద్దతు పెరుగుతోందని ఇంఛార్జ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తన టీమ్ తో అక్కడే తిష్ట వేసి పని చేస్తుండడంతో టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడిందన్నారు. ఆయా గ్రామాల్లో బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అదే విధంగా గ్రామాల్లోనీ యువకులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. శనివారం ఉడతలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ మరియు 40 మంది యువకులు ఎమ్మెల్యే సంక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  మునుగోడు గోడు తీర్చిన టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు జై కొడుతున్నారని అన్నారు. ఫ్లోరైడ్ రక్కసితో తండ్లాడిన మునుగోడు ప్రజల గోడును మిషన్ భగీరథతో తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. వ్యక్తిగత స్వార్థంతో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పునిస్తారని అన్నారు.