బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం!

బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం!
 ముంబయి : అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుంటూ… మరోవైపు బులియన్  మార్కెట్ లో బంగారం ధరలు కూడా పతనం అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గింది. దాంతో పసిడి ధరలు సోమవారం మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.  ఒక్కరోజులోనే గ్రాము బంగారం ధర రూ.520 తగ్గింది.  ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,500గా ఉంది. బంగారం ధరలు మరింతే తగ్గే అవకాశం కనిపిస్తోంది. 25వేల దిగువకు కూడా ధరలు పడిపోయే అవకాశం ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పడిపోతున్నాయి.