బంగారు తెలంగాణ వైపు రాష్ట్రం అడుగులు-మంత్రి మహేందర్‌

సంగారెడ్డి/మేడ్చల్‌,ఆగస్టు30  : అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చేపట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్టాన్న్రి బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మహేందర్‌ రెడ్డి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ, రైతు సమితిల ఏర్పాటు, మిషన్‌ భగీరథ విూద సవిూక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌ రెడ్డి, వివేకానంద, అరికెపూడీ గాంధీ, ప్రభాకర్‌, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సకాలంలో ప్రజల దరికి చేర్చుతోందని చెప్పారు. ఇక ప్రతిష్టాత్మకమైన మిషన్‌ భగీరథ పనులు వేగవంతం చేసి నిర్ధిష్ట కాలంలో మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 6లక్షల 20 వేల మంది మహిళలకు

తుకమ్మ చీరలు అందిస్తున్నామన్నారు. రైతాంగం అభ్యున్నతికి జిల్లాలో 110 రెవెన్యూ గ్రామాల్లో, 6 గ్రావిూణ మండలాల్లో 15 వేల 926 మంది రైతులతో సమాఖ్యలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం మల్లాపూర్‌ లో రూ. 234 కోట్ల నిధులతో 2700 డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణలకు మంత్రి మహేందర్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌ రూంలను రూ. 2474 కోట్లతో ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3642 డబుల్‌ బెడ్‌ రూంలను రూ. 1950 కోట్ల నిధులతో

నిర్మిస్తున్నామన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 11వేల 900 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విశ్వేశర్‌ రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు