గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామని చెప్పడంతో గిరిజన కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు భాద్యా నాయక్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బంజారా సేవా సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్ ఆరు శాతం నుండి 10% పెంచడం వలన నిరుద్యోగ గిరిజన యువత లబ్ధి చేకూర్తుందని, దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అలాగే పోడు భూముల సమస్యను త్వరలో పరిష్కరించి, భూమిలేని గిరిజన కుటుంబాలకు గిరిజన బందు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పడంతో గిరిజన కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిస్తుందన్నారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నీ గిరిజన నాయకులు బాద్యనాయక్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ ఎంపీపీ పల్త్యా విట్టల్, బాన్సువాడ, బీర్కూర్, నిజాంసాగర్ బంజారా సేవా సంఘం అధ్యక్షులు రాము రాథోడ్, గోవింద్, ఉత్తమ్ రాథోడ్, బలరాం సింగ్, బాబు సింగ్, పీర్య, రమేష్ రాథోడ్, అంబర్ సింగ్, రూప్ సింగ్, రామచందర్, సురేష్, కిషన్, ఆయా మండలాల గిరిజన సోదరులు తదితరులు పాల్గొన్నారు.