బంతి తగిలి మరోక్రికెటర్ మృతి

కరాచీ: క్రికెట్ మైదానంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఇంకా మదిలో ఉండగానే పాకిస్థాన్‌లో టీనేజ్ క్రికెటర్ కూడా బంతి తగిలి ప్రాణాలు వదిలాడు. ఆదివారం ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే కుర్రాడు.. ప్రత్యర్థి పేసర్ వేసిన బంతి బలంగా ఛాతీకి తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలాడు.

వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బంతి తగలడంతోనే గుండె తీవ్ర ఒత్తిడికి గురైందని, తమ దగ్గరికి వచ్చే సరికే మృతి చెందినట్టు డాక్టర్ సమద్ తెలిపారు. క్రికెటర్ తల్లిదండ్రులు మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశారని, ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.