ప్రపంచానికి మనమే నాయకులం
` ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది
` రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది
` మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోంది: రాష్ట్రపతి ముర్ము
న్యూఢల్లీి(జనంసాక్షి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ‘‘ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. దేశం మొత్తం గర్వించదగిన సందర్భం ఇది. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోంది. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగింది. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలి. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకొన్నాం. వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నాం. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చాం’’ అని రాష్ట్రపతి తెలిపారు.