బంద్‌కు సంఘీభావంగా జాతీయ రహదారిపై ఆందోళన
అబ్దుల్లాపూర్‌మెట్: విద్యుత్తు కోతలు, ఛార్జీల పెంపునకు నిరసనగా విపక్షాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న బంద్‌కు సంఘీభావంగా హయత్ నగర్ మండలం అబ్దుల్లా పూర్‌మెట్ కూడలిలో తెదేపా, సీపీఐ, సీపీఎం, వైకాపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయిండంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.