బంద్‌ కారణంగా బొసిపోయిన బాసర పరిసరాలు

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా బాసర సరస్వతి అలయంపై బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాలు బంద్‌కు పిలుపునీయడంతో అర్టీసీ డిపోల నుంచి బస్సులు కదలలేదు. దాంతో నిత్యం కిటకిటలాడే బాసర అలయం ఈరోజు బోసిపోయింది. ఉదయం రెండు నిత్యం రాత్రి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయప్రాంగణమంతా ఖాళీగా కన్పించింది.