బంద్ సందర్భంగా అద్దంకిలో ఉద్రిక్తత
అద్దంకి గ్రామీణం : విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, తెదేపా నేత కరణం వెంకటేశ్‌లు చేస్తున్న నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పట్టణంలోని భవానీ కూడలి వద్ద ఇరుపార్టీలు ఎదరెదురు పడిన సందర్భంలో కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. ద్విచక్రవాహనాలను తోసుకోవటంతో ఒకరిపై స్వల్పంగా దాడులు చేసుకున్నారు. తాజాగా పాత బస్టాండు సెంటరులో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రదర్శనలు చేస్తూ ఎదురెదురు పడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.



