బచావత్‌ అవార్డు నీటివాటా కోసం పోరాడుదాం

1

 

2
తెలంగాణను సస్యశ్యామం చేద్దాం
నల్గొండ, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి):

1974లో బచావత్‌ అవార్డుక్రింద గో దావరి, కృష్ణా బేసిన్‌ ద్వారా 265 టి. యం.సిల నీరు కేటాయించినదని, ఈ నీటి ద్వారా రాష్ట్రంలోని 46 వేల చెరు వులు నిండినట్లయితే 3 సంవత్సరాల వరకు కరువు దరి చేరదని  సీఎం కేసీ ఆర్‌ అన్నారు. నల్లగొండ జిల్లా చందు పట్లలో శనివారం సీఎం కేసీఆర్‌ మిష న్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. గత పాలకుల నిర్లక్షం వల్ల ప్రతి చెరువులో పూడికలు పెరిగిపోయాయని, జిల్లాలోని చందుపట్ల చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే నకిరేకల్‌ నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామన్నారు.11వ శతాబ్దంలోనే వాటర్‌ షెడ్‌ పథకాలను కాకతీయ పాలకులు ప్రపంచానికి పరిచయం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 102 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చందుపట్ల చెరువుకు 55 లక్షల నిధులు సరిపోవన్న కేసీఆర్‌.. అదనంగా 1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. చందుపట్ల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ చెరువులో పూడిక తీయడం వలన చెరువు క్రింద 7 గ్రామాలలోని వేల ఏకరాలకు నీరు అందుతుందని ఆయన తెలిపారు. ఈ చెరువుకు యస్‌.యల్‌.బి.సి కెనాల్‌కు ఫీడర్‌ ఛానల్‌ కనెక్షన్‌ ఇవ్వడం వలన ఈ ప్రాంతములో ఎప్పుడు నీరు ప్రవహించే అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్‌ అన్నారు. ఈ చెరువు పనులను త్వరితగతిన పూర్తి చేయించినట్లయితే నకిరెకల్‌ యం.యల్‌.ఎకు నియోజక వర్గ అభివృద్ధి కొరకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని ఈ చెరువు నకిరెకల్‌ యం.యల్‌,ఎవిరేశం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాలో 4,767 చెరువులలో మిషన్‌ కాకతీచ ద్వారా చెరువుల పూడిక తీసి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.  పూడికల తొలగించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు కాకతీయ తోరణంను నిర్మించి ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. చందుపట్ల గ్రామానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని రుద్రమదేవి ఈ ప్రాంతంలో యుద్ధం చేసి మరణించినట్లు శాలాశాసనాలు ఉన్నాయని, కాకతీయులు 11వ శతాబ్ధంలోనే వాటర్‌ షెడ్‌ల ద్వారా నీటిని నిల్వ చేసి ఉపయోగించుకొనే పరిజ్ఞానాన్ని కలిగిఉన్న రాజులని కొనియాడారు.