బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి

 

మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి, రంగారెడ్డి

మల్కిజ్ గూడా గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి వందమంది కాంగ్రెస్ లో చేరిక

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జులై12(జనంసాక్షి):-యాచారం మండలం మల్కిజ్ గూడ గ్రామంలో వివిధ పార్టీల నుంచి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన వందమంది కాంగ్రెస్ లో జాయిన్ కావడం జరిగింది ఈ సందర్భంగా వారిని రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద విసుగు చెంది ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు రాష్ట్రంలో ప్రజలు తెరాస ప్రభుత్వాన్ని 100 ఫీట్ల లోతులో పాతి పెట్టడం ఖాయమన్నారు రాబోయే రోజుల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందని భరోసా కల్పించారు అదేవిధంగా అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అది మనందరి బాధ్యత అని పేద బడుగు బలహీన వర్గాలకు రైతులకు నిరుద్యోగులకు విద్యార్థులకు అందరికీ న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జెడ్పిటిసి మహిపాల్, నాయకులు గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి శ్రీనివాస్ నాయక్ ,యాచారం మండల అధ్యక్షులు మస్కు నరసింహ, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి ,జిల్లా నాయకులు గులాం అక్బర్ ,బుచ్చిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శులు వరికుప్పల సుధాకర్, గడల మల్లేష్, ఎంపీటీసీలు మస్కు భారతమ్మ ఈశ్వర్, లక్ష్మీపతి గౌడ్, కొర్ర జ్యోతి అరవింద్ నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరారం వెంకటరెడ్డి ,ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లేష్ ,యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ముచ్చర్ల సంపత్, మండల నాయకులు చీర శేఖర్ యాదయ్య మధుసూదన్ రెడ్డి, రాజి రెడ్డి రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ చీర యాదమ్మ, గ్రామ శాఖ అధ్యక్షులు జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజకుమార్, గ్రామ శాఖ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు