బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డిఎన్అర్ – కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య.


ఊరుకొండ, డిసెంబర్ 7 (జనంసాక్షి):
బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజల ఆశాజ్యోతి ద్యాప నిఖిల్ రెడ్డి(డిఎన్ఆర్) అని కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య అన్నారు. బుధవారం ఊరుకొండ మండలంలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన సల్వాది పెద్ద నాగయ్య(45) అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న మాధారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ..
బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిస్తూ 5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరికి ఏ ఆపద వచ్చిన ఎల్లవేళలా అండగా ఉంటున్న మాకు, వంద కాలాల పాటు మా దివేనలతో మరెన్నో ఉన్నత స్థాయి రాజకీయ పదవులను అధిరోహించాలని కోరుతున్నా మన్నారు. పేదల కళ్లలో ఆనందాన్ని చూడటమే లక్ష్యంగా పని చేస్తున్న ద్యాప నిఖిల్ రెడ్డి సంతోషంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, దుబ్బ మల్లేష్, నాగరాజు, దుబ్బ రాజు, చంద్ర శేఖర్, హరికృష్ణ, గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, తదితరులు పాల్గొన్నారు.