బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..?

హైదరాబాద్‌
వ్యవసాయ అభివృద్ధి తిరోగయనంలో ఉంది.
-చంద్రబాబునాయుడు

ఇది రాష్ట్ర బడ్జెట్‌లా లేదు… యాక్షన్‌ప్లాన్‌లా ఉంది. వ్యవసాయంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రవేశపెట్టి ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టించింది.
– శోభానాగిరెడ్డి, వైకాపా సభ్యురాలు


గత బడ్జెట్‌లో వ్యవసాయానికి 4.1 శాతం నిధులు ఇవ్వగా ప్రస్తుతం 3 శాతమే కేటాయించారు. గత ఏడాదికన్నా ఈ సారి విద్యుత్‌కు కేటాయింపులు తగ్గించారు. వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు.
-అశోక్‌గజపతి రాజు, తెదేపా నేత

బడ్జెట్‌ సమావేశంలో వ్యవసాయం కార్యాచరణ ప్రణాళిక ప్రవేళపెట్టి మా హక్కులకు భంగం కలిగించారు.
– రావుల చంద్రశేఖర్‌రెడ్డి


ప్రభుత్వ పాఠశాలలో గతేడాది 80 లక్షల మంది విద్యార్థులను చూపించారు, ఇప్పుడు 70 లక్షలుగా ప్రస్తావించారు. ఇలాంటి వ్యవసాయ బడ్జెట్‌ దురదృష్టకరం. రైతుల గురించి కల్లబొల్లి మాటలు. కవితలు చెప్పి కేటాయింపులు తగ్గించారు. ఇది భవిష్యత్తుపై అవగాహన లేని బడ్జెట్‌.
– జయప్రకాశ్‌నారాయణ, లోక్‌సత్తా అధినేత


ప్రస్తుతం బడ్జెట్‌తో సంక్షేమం కన్నా సంక్షోభం పెరిగే అవకాశం ఉంది. ఉత్పత్తిలో ద్రవ్యలోటును ఏ విధంగా పూడుస్తారో చెప్పాలి. రానున్న కాలంలో రాష్ట్రం రూ. 2 లక్షల కోట్లు అప్పులను మూటగట్టుకుంటుంది.
-యనమల రామకృష్ణుడు , తెదేపా సీనియర్‌ నేత


రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా బడ్జెట్‌ లో వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారు. దీనిని రాష్ట్ర బడ్జెట్‌ అనడం కంటే చిత్తూరు జిల్లా బడ్జెట్‌ అంటే సరిపోతుంది.
– ఈటెల రాజేందర్‌, తెరాస నేత


దేశంలో ఎ్కడా లేని విధంగా మైనార్టీలకు ఎక్కువగా నిధులు కేటాయించారు.
-మంత్రి అహ్మదుల్లా
బీసీల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించారు.
-యెండల లక్ష్మీనారాయణ, భాజపా


ఎన్నికల్లో ఓట్లే లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది.
– గుండా మల్లేశ్‌


వ్యవసాయానికి అదనంగా ఒక్క రూపాయి కేటాయించలేదు. వ్యవసాయానికి నిధులు కేటాయించకుండా మోసగించడాన్ని రైతులు క్షమించరు.
– జూలకంటి రంగారెడ్డి