బతుకమ్మ చీరలు పంపిణీ
సంబరంగా పండగ జరుపుకోవాలి,
* తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పండుగ కానుక,
* ఎమ్మెల్యే పెద్ది,
ఖానాపురం సెప్టెంబర్ 23జనం సాక్షి
తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సంతోషంగా
జరుపుకోవాలనే బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి మహిళ సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. అలాగే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని సంకల్పించారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి పది లక్షల మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అధికారంలో ఉన్న పాలకులు ఏనాడు ప్రజలకు ముఖ్యంగా మహిళల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఒడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్,ఎంపీపీ వేములపల్లిప్రకాష్ రావు, వైస్ ఎంపీపీ ఉమారాణి ఉపేందర్రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు వెంకట నరసయ్య, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు,తదితరులు పాల్గొన్నారు.