బతుకమ్మ చీరల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్
వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ టౌన్ సెప్టెంబర్ 27 ( జనంసాక్షి )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక 30వ మరియు 31వ వార్డ్ నందు నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ పాల్గొని బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని,ముఖ్యమంత్రికే చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తీరొక్క రంగుల్లో బతుకమ్మ చీరలు సిరిసిల్ల,
పోచంపల్లి,గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో చేయించిన 240 పై చిలుకు వివిధ వెరైటీ డిజైన్ ల చీరలను పంపిణీ చేస్తున్నారని ఈనెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు జరుగు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడపడుచులకు అందరికీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.అందరూ ఆనందోత్సవంతో
బతుకమ్మ పండుగను జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు వార్డ్ కౌన్సిలర్స్ పెందెం వెంకటేశ్వర్లు,షేక్.మధార్ సాహెబ్,తిపిరిశెట్టి సుశీల రాజు,మున్సిపల్ అధికారులు,వార్డ్ ఆఫీసర్స్,వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.