*బతుకమ్మ సంబరాలు ప్రారంభం

*ఎన్ జి కళాశాల లో బతుకమ్మ వేడుకలు ప్రారంభించిన శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*

నల్గొండ బ్యూరో. జనం సాక్షి
.తెలంగాణ రాష్ట్ర సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు ఆదివారం ఎన్.జి.కళాశాల మైదానం   లో జిల్లా యంత్రాంగం తరపున అధికారికంగా నిర్వహిస్తున్న మొదటి రోజు బతుకమ్మ వేడుకలను శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ మహిళలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి,పూల పండగ బతుకమ్మ అని అన్నారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లో ఆంధ్ర పాలకులు హయాంలో ఎన్నో కష్టాలు అనుభవించామని, ఆనాటి ఉద్యమ నాయకుడు కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమం లో అన్ని వర్గాలు భాగస్వామ్యం తో ప్రాణాలు ఫణంగా పెట్టీ తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు తెలంగాణ రాష్ట్రం లో బతుకమ్మ ను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు,ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్ని మతాలను సమానంగా ఆదరిస్తున్నారని,రంజాన్,క్రిస్మస్ పండుగలకు గిఫ్ట్ ప్యాకెట్ లు,బతుకమ్మ కు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు.ప్రతి కుటుంబం సంతోషం గా వుండేలా సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.మొదటి రోజు పరిశ్రమల శాఖ,మార్కెటింగ్,మెప్నా, మహిళ,శిశు సంక్షేమ శాఖల మహిళలు బతుకమ్మ లో పాల్గొన్నారని,ప్రతి రోజూ మూడు,నాలుగు శాఖల చొప్పున బతుకమ్మ ఆడుతారని అన్నారు.నల్గొండ వల్లభ రావు చెరువు ను నక్లేస్ రోడ్డు గా,ఉదయ సముద్రం ను ట్యాంక్ బండ్ గా అభివృద్ది పరుస్తున్నట్లు వెల్లడించారు.
*ఉత్తమ బతుకమ్మ కు ప్రైజ్ మనీ ప్రకటించిన శాసన సభ్యులు*.
సద్దుల బతుకమ్మ ను వల్లభ రావు చెరువు వద్ద ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.అన్ని శాఖలు,అన్ని వార్డుల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, సంప్రదాయంగా అన్ని రకాల పూలతో పేర్చిన ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు ప్రైజ్ మనీ ప్రకటించారు.మొదటి ప్రైజ్ 50 వేల రూ.లు,రెండవ ప్రైజ్ 25 వేల రూ.లు,మూడవ ప్రైజ్ 10 వేల రూ.లు,నాలుగు,ఐదు,ఆరు ఉత్తమ బతుకమ్మ లకు 5 వేల రూ.లు చొప్పున ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి,అర్.డి. ఓ.జగన్నాథ రావు,మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణా చారి,డి.అర్.డి. ఓ కాళిందిని ,మహిళ శిశు సంక్షేమ అధికారి సుభద్ర,మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్,డి.పి.అర్. ఓ శ్రీనివాస్,పరిశ్రమల శాఖ జి.యం.కోటేశ్వర రావు,జిల్లా బాలల సంరక్షణ అధికారి గణేష్,కో ఆప్షన్ మెంబర్ జాన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు