బతుకమ్మ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకుందాం
సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ .
హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 01(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకునేందుకు అందరూ కలిసి కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు.శనివారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో భారత జాతీయ మహిళా సమాఖ్య ( ఎన్.ఎఫ్.ఐ.డబ్యూ ) సిద్ధిపేట జిల్లా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు హాజరైనారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు పల్లేపల్లేల్లో పట్టణ ప్రాంతాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారని పాడి పంటలు బాగా పండి రైతులు కూలీలు కార్మికులు ఉద్యోగులు ప్రజలందరూ సంతోషం గా ఉండాలని మంద పవన్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్, అక్కన్నపెట సిపిఐ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, ఏగ్గొజు సుదర్శన్ చారి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాల మమత,జిల్లా కార్యదర్శి పిల్లి రజినీ, ఎఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె సుజిత్ కుమార్, సిపిఐ మండల నాయకులు వంగొజు భాస్కరా చారి,
తొట అయిలయ్య, భారత జాతీయ మహిళా సమాఖ్య నాయకురాల్లు ఏలురి స్వాతి,రాయిళ్ళా శోభ,మంద రుచిత ,కొమ్ముల వనిత, తొందూరి రేవతి,పెద్ది నిర్మల,నేర్నాల శ్యామల,తదితరులు పాల్గొని బతుకమ్మ ఆట పాటలతో అందరినీ అలరించారు.