బయ్యారం ఉక్కు కోసం సిపిఐ ఆందోళన

మహబూబాబాద్‌,మే2( జ‌నం సాక్షి):  తెలంగాణా రాష్ట్ర విభజన అంశంలో భాగంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ,ఇచ్చిన ఇతర హావిూల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బీ.విజయసారధి డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా బయ్యారం క్కు ఫ్యాక్టరీని సాధించేందుకు  పోరాడుతామని అన్నారు. ప్రభుత్వ  వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సీపీఐ పోరాట   కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. విభజన హావిూలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించి తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు. పొడుభూముల విషయంలో ,రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో,రుణమాఫీ విషయంలో,రెవెన్యూ అక్రమాలు, డబుల్‌ బెడ్రూంల విషయంలో తాత్సారం చేస్తూ పేదవాడికి అందకుండా ప్రజాసంక్షేమం పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని అన్నాఉ.
ఈ ప్రభుత్వాలను గద్దెదింపే వరకూ తమ సీపీఐ పోరాటం ఆగదని తెలిపారు.