బయ్యారం గనులపై టీఆర్‌ఎస్ భేటీ
హైదరాబాద్, జనంసాక్షి: బయ్యారం గనులపై చర్చించేందుకు ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ భేటీ అయింది. ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్ నేతలతో సమావేశమయ్యారు. బయ్యారం గనులపై సీమాంధ్ర ప్రభుత్వంపై ఉద్యమం చేసే దానిపై చర్చిస్తున్నారు. బయ్యారం ఉక్కును విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించకుండా ఉండేందుకు పక్కా కార్యాచరణను రూపొందింస్తున్నట్లు సమాచారం. బయ్యారం ఉక్కును విశాఖ ఉక్కుకు తరలిస్తామని సీఎం కిరణ్ ప్రకటించడంతో తెలంగాణకు అన్యాయం జరుగకుండా ఉండేందుకు ఉక్కు తరలింపును అడ్డుకుంటామని టీఆర్‌ఎస్ హెచ్చరించిన విషయం తెలిసిందే.