బరోడా, ఒడిషా జట్లకు విజయాలు డ్రాగా ముగిసిన హైద్రాబాద్-ముంబై మ్యాచ్
హైదరాబాద్, నవంబర్ 27: రంజీ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. టాప్ టీమ్ కర్ణాటకకు ఒడిషా షాకిస్తే… ¬రా¬రీగా సాగిన మ్యాచ్‌లో బరోడా హర్యానాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆఖరిరోజు 17 వికెట్లు నేలకూలడం విశేషం. 2 వికెట్లకు 127 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్ కొనసాగించిన హర్యానా అనూహ్యంగా కుప్పకూలింది. బరోడా పేసర్ల ధాటికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. సన్నీ సింగ్ 57 , అభిమన్యు 38 పరుగులు తప్పిస్తే మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటయ్యారు. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన హర్యానా 160 పరుగులకు ఆలౌటైంది. తర్వాత 133 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బరోడా కూడా తడబడింది. 48 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఈ దశలో వకాస్కర్ , గగన్‌దీప్‌సింగ్ ఆదుకున్నారు. బౌలర్లకు అనుకూలిస్తోన్న పిచ్‌పై సహనంతో ఆడి జట్టు స్కోర్ 100 దాటించారు. విజయానికి 30 పరుగుల దూరంలో వీరు కూడా ఔటవడంతో బరోడా ఓటమి ఖాయమని అంతా భావించారు. అయితే పటేల్ , భార్గవ్ భట్ జట్టును గెలిపించారు. దీంతో బరోడా 1 వికెట్ తేడాతో హర్యానాపై గెలుపొందింది. తద్వారా ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్‌లో ఒడిషా జట్టు కర్ణాటకకు షాకిచ్చింది. 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కర్ణాటక ఆద్యంతం తడబడింది. రాబిన్ ఊతప్ప , స్టువర్ట్ బిన్నీ తప్పించి మిగిలిన బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు 179 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. మరోవైపు ముంబై , హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఊహించినట్టుగానే హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని సాధించింది. విహారీ , అక్షత్‌రెడ్డి సూపర్ సెంచరీలతో ముంబైకి ధీటుగా స్పందించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 699 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. టాపార్డర్‌లో సందీప్ కూడా సెంచరీ చేయగా… ఆశిష్‌రెడ్డి , సుమంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో హైదరాబాద్‌కు 256 పరుగుల ఆధిక్యం దక్కింది. హైదరాబాద్ ఆలౌటైన వెంటనే ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా హైదరాబాద్‌కు 3 పాయింట్లు లభించగా… ముంబైకి 1 పాయింట్ దక్కింది. ఇక ఢిల్లీ-తమిళనాడు, జార్ఖండ్-హిమాచల్‌ప్రదేశ్ మ్యాచ్‌లు కూడా డ్రాగా ముగిశాయి.