బలమైన ఉద్యమాలతోనే జిల్లా ఏర్పాటు సాధ్యం:-
మిర్యాలగూడ. జనం సాక్షి
గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని బలోపేతం చేసి బలమైన ఉద్యమాలు చేపట్టడం ద్వారానే మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు సాధ్యమని తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ మాలి ధర్మపాల్ రెడ్డి, బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి రాజు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి లు అన్నారు. గురువారం మిర్యాలగూడ లోని సాయినాథ్ ఫంక్షన్ హాల్ లో బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు, మిర్యాలగూడ జిల్లా సాధన సమితి సభ్యులు మాలోతు దశరథ నాయక్ అధ్యక్షతన జరిగిన మిర్యాలగూడ సాధన సమితి కార్యాచరణ నిర్ణయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉద్యమ తీవ్రత ప్రజల ఆకాంక్షను అన్ని వర్గాల ప్రజల్లో తీసుకోవాలని వారు అన్నారు. జిల్లా ఏర్పాటు కోసం రిలే నిరాహార దీక్షలు, సైకిల్ యాత్ర,పాదయాత్ర చేపట్టాలని సూచించారు. ప్రజల అభిప్రాయాన్ని మూడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు గుర్తించాలని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. జిల్లా ఏర్పాటు ఉద్యమం ఐక్యంగా చేపట్టి ముందుకు వెళ్లాలని కోరారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి బిఎస్పి మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జ్ నాగేశ్వరరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి సత్యప్రసాద్, జనసేన పార్టీ జిల్లా నాయకులు వెంకటేష్ నాయక్, ఆప్ జిల్లా సహాయ కార్యదర్శి కుతుబుద్దీన్, ఎం ఐ ఎం జిల్లా సహాయ కార్యదర్శి ఫారూక్ అభ్యాస సంస్థల వ్యవస్థాపకులు వంగాల నిరంజన్ రెడ్డి, సామాజిక వేత్త డాక్టర్ మునీర్, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంత రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణారెడ్డి,ఎల్లయ్య, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, సీనియర్ జర్నలిస్టు అస్లాం, మంద సైదులు, విద్యార్థి ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం శ్రీనివాస్ బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, యాదవ సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు చిమట ఎర్రయ్య చేగొండి మురళి యాదవ్, సామాజిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజు బీసీ సంఘం నాయకులు సైదులు గౌడ్, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు దుర్గయ్య విద్యార్థి సంఘం నాయకులు అంజి, ఎమ్మార్పీఎస్ నాయకులు సైదులు, మాలమహానాడు నాయకులు నాగేష్,బీఎంపీ నాయకులు మోసినలీ, జానీ బాబా తదితరులు పాల్గొన్నారు.