‘బలమైన భారత్‌- బలమైన జపాన్‌’

2the-minister-of-foreign-affairs-of-japan-mr-fumio-kishida-calling-on-the-prime-minister-shri-narendra-modi2011వ శతాబ్ధం ఆసియా దేశాలదేనని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ గురువారం వెళ్లారు. ఈ సందర్బంగా జరిగిన జపాన్‌-భారత్‌ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, జపాన్‌ పారిశ్రామికవేత్తలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.విదేశీ పెట్టుబడుల ఈక్విటీ ఇన్‌ఫ్లోలు గత రెండేళ్లలో 52శాతం పెరిగినట్లు మోదీ చెప్పారు. ప్రపంచ ఆర్థిక ఫోరంలో ప్రపంచ పోటీతత్వ దేశాల జాబితాలో భారత్‌ 32 స్థానాలు పైకి ఎగబాకిందని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’, ‘మేడ్‌ బై జపాన్‌’ కాంబినేషన్‌ కూడా అద్భుతంగా ఉందన్నారు. భారత్‌లో పెట్టుబడులకు జపాన్‌ను సాదరంగా ఆహ్వానించారు. జపాన్‌ టెక్నాలజీని, అనుభవానికి భారత్‌లో మంచి స్థానం లభిస్తుందన్నారు. ‘బలమైన భారత్‌- బలమైన జపాన్‌’లు కలిసి ప్రపంచంలో ఆసియాకు స్థిరమైన స్థానం కల్పిస్తాయన్నారు. భారత్‌లో ప్రత్యక్ష పెట్టబుడులు పెట్టిన దేశాల్లో జపాన్‌ 4వ స్థానంలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండో-జపాన్‌ వ్యాపార వేదికను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. ప్రతి అంతర్జాతీయ సంస్థ భారత్‌ కోసం ప్రత్యేక వ్యూహం రూపొందిస్తోందన్నారు.