బలిపశువును చేశారంటూ మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన
హైదరాబాద్ : ధర్మాన ప్రసాదరావును మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, వట్టి వసంతకుమార్ ఈ ఉదయం కలిశారు. తనను బలిపశువును చేశారంటూ మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధిష్ఠానం నిర్ణయం శిరసావహించి పార్టీకి సేవచేస్తానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.