బషీర్‌బాగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): బషీర్‌బాగ్‌లోని స్కైలైన్‌ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తుపై ఉన్న టెర్రస్‌పై భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెంట్‌ హౌస్‌లో ఉన్న ఫ్లాట్‌లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో పెంట్‌ హౌస్‌లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాద ఘటనతో అపార్టమెంట్‌ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.