బస్సుకు ఢీకొని ఓ వ్యక్తి మృతి…

మృతి చెందిన వ్యక్తి
దృశ్యం…

రుద్రూర్ (జనంసాక్షి):- రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆర్టీసీ బస్సుకు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామానికి చెందిన రాజు(26), అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై బోధన్ నుండి వస్తుండగా, బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బీర్కూర్ వైపు నుండి బోధన్ కు వెళ్తుండగా రుద్రూర్ గ్రామ శివారు వద్ద ద్విచక్ర వాహనం పై ఉన్న రాజు ఓవర్టేక్ చేస్తూ అటువైపు నుంచి వస్తున్న బస్సుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి రుద్రూర్ ఎస్సై రవీందర్ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.