బస్సును ఢీకొన్న లారీ: 20 మందికి గాయాలు

సిద్దిపేట (జ‌నంసాక్షి) : మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని గోండియా నుంచి వస్తుండగా సిద్దిపేట సమీపంలో లారీ ఢీకొంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్తానికులు స్పందించి క్షతగాత్రులను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.