బస్సుయాత్రలతో విమర్శలా?

మెదక్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు.  రాష్టాన్న్రి బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరికీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్‌ బస్సుయాత్రలు చేస్తూ విమర్శలకు దిగుతోందని ఎద్దేవా చేశారు.  రైతులకు ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి సాయం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. 2016-2017లో మంజూరైన ఎస్సీ కార్పొరేషన్‌ యూనిట్టను నియోజకవర్గంలో 109 మంది లబ్ధిదారులకు అందించామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ల ద్వారా రూ.1 లక్ష రూపాయలు ఇవ్వడం గర్వించదగిన విషయమని తెలిపారు. అదేవిధంగా  మహిళలకు గ్యాస్‌ కనెక్షన్‌లు పంపిణీ చేశామని చెప్పారు.