బస్సు ఎక్కుతూ కిందపడి వ్యక్తి మృతి
సదాశివపేట: బస్సు ఎక్కుతూ ప్రమాదశాత్తు బస్సు కింద పడి ఓ ప్రయాణికుడు చనిపోయిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. సదాశివపేటకు చెందిన మల్లేశం తన కుమారుడితో కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు బస్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఒక్కసారిగా బస్సు ముందుకు కదలడంతో మల్లేశం కిందపడిపోయాడు. డ్రైవర్ తేరుకునేలోపే బస్సు ముందు చక్రాలు అతని మీద నుంచి వెళ్లాయి. దీంతో మల్లేశం అక్కడికక్కడే చనిపోయాడు.