బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, ఈవిటీజింగ్ పాల్పడిన కఠిన చర్యలు – రాజోలి ఎస్ఐ లెనిన్..
గద్వాల ప్రతినిధి నవంబర్ 04 (జనంసాక్షి):- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన మహిళలు విద్యార్థులకు అసౌకర్యం కలిగించిన కఠిన చర్యలు తప్పవని రాజోలి ఎస్ఐ లెనిన్ హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని ఆయా గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రోడ్లపై కానీ, గ్రామంలోని ప్రధాని కూడాలో కానీ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమన్నారు. పాఠశాలలకు వచ్చిపోయే విద్యార్థినులకు, మహిళలను హేళనగా మాట్లాడడం తగదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు భంగం కలిగిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న కనిపిస్తే స్థానికులు వెంటనే 100 డయల్‌కు సమాచారం అందించాలి ఎస్ఐ కోరారు.