బహుజన ఉపాధ్యాయ వాణిని చట్టసభల్లో వినిపిస్తా

– మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఎస్ విజయ్ కుమార్
నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో నవంబర్17 జనంసాక్షి:
   ఉపాధ్యాయుల వాణిని చట్టసభల్లో వినిపించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ మరియు బహుజన ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి విశ్రాంత ఆచార్యులు, డిఇఓ డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ అన్నారు.
 ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన లింగాల, బల్మూర్, అచ్చంపేట మండలాల్లోని పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయులను కలసి ఓట్లు అభ్యర్ధించారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
 తాను 33 సంవత్సరాల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వివిధ స్థాయిలో పనిచేసి విద్యా అభ్యున్నతికై కృషి చేశానని అన్నారు.
 ప్రభుత్వ విద్యా బలోపేతానికి అనేక కార్యక్రమాల్లో పాల్గొని విజయం సాధించానన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ప్రథమ ప్రాధాన్యతా ఓటు తనకు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు.
దశాబ్దాలుగా సర్వీసు రూల్స్ లేక ఏ క్యాడర్లో ఉపాధ్యాయుడు నియామకం అవుతున్నాడో అదే క్యాడర్లో పదవి వీరమణ చెందుతున్నాడని, ప్రత్యేక చొరవ తీసుకొని అందరికి ఆమోదయోగ్యమైన సర్వీసు రూల్స్ అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 రాష్ట్రంలో 1,72,000ల మంది సి.పి.ఎస్. ఉపాధ్యాయ ఉద్యోగులు అనునిత్యము రద్దుకై పోరాటం చేస్తామని అన్నారు.
ఉపాధ్యాయ సమస్యలు, పదోన్నతులు బదిలీలు వెంటనే చేపట్టి ప్రభుత్వం పరిష్కారం చూపాలి అన్నారు.
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూల్స్, కె.జి.బి.విలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారించగలరని,
 10 నెలలుగా దరఖాస్తు చేసుకొని భార్య ఒకచోట భర్త ఒకచోట పని చేస్తూ ఉన్న 13 జిల్లాల Spouse ఉపాధ్యాయులకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
 జి.ఓ.ను రద్దు చేయడము లేదా జి.ఓ. వల్ల నష్టపోయిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను గుర్తించి వారు కోరిన విధంగా స్థానికత కోల్పోకుండా న్యాయం జరిపించేలా కృషి చేస్తామన్నారు.
 దేశంలో కొన్ని రాష్ట్రాలలో సి.పి.ఎస్ను రద్దు చేయడం జరిగిందని, మన రాష్ట్రంలో రద్దుకై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.
 దాదాపు 8సం||లుగా పదోన్నతులు లేవు. 5సం॥లుగా బదిలీలు లేవు. వీటిని వెంటనే జరిపించాలని డిమాండ్ చేశారు.
మోడల్ స్కూలు ఉపాధ్యాయులకు 9సం||లుగా బదిలీలు లేవు. వారికి బదిలీలు జరిపించి 010 పద్దు
 బడ్జెట్ క్రింద వేతనాలు చెల్లించాలన్నారు. కస్తూర్భాగాంధీ పాఠశాలలో, కళాశాలలో పని చేస్తున్న C.R.T. మరియు P.G.C.R.T. లకు బదిలీల ప్రక్రియ చేపడుతూ వీరిని హీమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మాదిరిగా రెగ్యులరైజేషన్ చేయాలని, (ఇప్పటికి పంజాబ్, హర్యాన, త్రిపుర, మణిపూర్, ఢిల్లీ, చత్తీస్గడ్ రాష్ట్రాలు M.T.S. సౌకర్యం కల్పిస్తున్నాయి). వీరికి స్కూల్ అసిస్టెంట్ స్థాయి మూలవేతనము, జూనియర్ లెక్చరర్ స్థాయి మూలవేతనము ఇస్తూ ఇతర ప్రభుత్వ ఉద్యోగినిల మాదిరిగా 22+5=27 క్యాజువల్ సెలవులు మంజూరు చేయాలని, కె.జి.బి.వి. పాఠశాలలో హాస్టల్ నిర్వాహణకు ప్రత్యేక ఉద్యోగ నియామకం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయన వెంట బిసిటిఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్ వెంకటయ్య ఇతర ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు

తాజావార్తలు