బాచుపల్లి పారిశ్రామకవాడలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): బాచుపల్లి పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు కెమికల్ ఫ్యాక్టరీలలో మంటలు ఎగిసిపడుతున్నాయి. బాచుపల్లి పారిశ్రామికవాడలో ఇవాళ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఆదిత్యా ఫార్మా, మైనింగ్ ఆల్లా పరిశ్రమల్లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న 6 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నించాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ
ప్రాంతంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. షార్ట్‌సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.