బాడ్మింటన్‌ డబుల్స్‌లో నిరాశపరిచిన జ్వాల, దిజు

లండన్‌: ఒలంపిక్సిలో శనివారం జరిగిన బాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలో భారత్‌కు నిరాశ ఎదురైంది. జ్వాల గుత్త, దిజుల జోడీ ఇండోనేషియాకు చెందిన తాంతోవి అహ్మద్‌, లిలియానా నట్సిర్‌లతో ఓపెనింగ్‌ మ్యాచ్‌లో తలపడింది. ఈ పోటీలో జ్వాల, దిజులు 16-21, 12-21 తేడాతో ఓడిపోయారు. 25 నిముషాల్లో ఈ  మ్యాచ్‌ ముగిసింది. రేపు డేనిష్‌ క్రీడాకారులతో భారత్‌ తలపడుతుంది.