బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బి ఆర్ ఎస్ నాయకులు

కొడకండ్ల,నవంబర్08( జనంసాక్షి) కొడకండ్ల పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ రైతు బంధు అధ్యక్షులు గార్లపాటి ఉపేందర్ రెడ్డి మాతృమూర్తి గార్లపాటి మాణిక్యమ్మ మృతి చెందాగా విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాము, మండల రైతు బంధు అధ్యక్షులు దికొండా వెంకటేశ్వరరావు, యన్ ఆర్ ఇ జి ఎస్ కౌన్సిల్ సభ్యులు అందే యాకయ్య, ఏ యం సి డైరెక్టర్ కుందూరు అమరేందర్ రెడ్డి భౌతిక దేహాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు మసూరం వెంకటనారాయణ,ఎస్ సి సెల్ అధ్యక్షుడురామస్వామి ,నాయకులు శ్రీశైలం, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.