బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి
మెదక్,ఫిబ్రవరి28(జనంసాక్షి): సంగారెడ్డి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ రాహుల్‌బొజ్జాకు వినతిపత్రం సమర్పించారు. జీవో నెం. 421 ప్రకారం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ శెట్కార్, మాజీ ఎమ్యెల్యే శశిథర్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షులు జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేగుంటలో సీఐటీయూ ఆందోళన చేపట్టింది. బీడీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాలామణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొందరికే జీవన భృతిని మంజూరు చేయడం అన్యాయమని అన్నారు. బీడీలు చేసే ప్రతి ఒక్కరికీ జీవన భృతినివ్వాలని ఆమె డిమాండ్ చేశారు