*బాధ్యతలను వజ్ర సంకల్పం తో ధర్మబద్ధంగా నిర్వర్తించడమే దేశభక్తి. సామాజిక ఆర్థిక* విద్యా వేత్త బడుగుల సైదులు.
కోదాడ, ఆగస్టు 24(జనం సాక్షి)
ప్రతి భారతీయులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించినపుడు భారత స్వాతంత్ర్య ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని సామజిక ఆర్థిక విద్యా వేత్త బడుగుల సైదులు తెలిపారు. భారత స్వతంత్ర 75 సంవత్సరం వజ్రొత్సవాలు సంధర్భంగా పత్రిక వారితో ,దేశభక్తులు అంటే తమ బాధ్యతలను సక్రమంగా, ధర్మబద్ధంగా నిర్వర్తించడం అని అన్నారు.మోసం,లంచం తీసుకోకుండా వ్యారమైన ఉద్యోగము అయిన బాధ్యత తోచేయలన్నరు. నీతి నిజాయితీ విలువలు కూడిన రాజకీయాలు చేయాలన్నారు. బ్యాంకుల వద్ద ఋణాలు తీసుకొన్న వారు సకాలంలో చెల్లించాలని తెలిపారు.ప్రకృతిని కాపాడి కాలుష్యాన్ని నివారించాలి. సాటి మనిషి ని మనిషిగాగుర్తించి మానవత్వ వంతో మెలిగే వారంతా నిజమైన దేశభక్తి గలవారు.డబ్బు తీసుకోకుండా కులం మతం చూడకుండా నిజంగా మంచి వాళ్లకు ఓటు వేసేవారే భారత స్వతంత్ర, స్వరాజ్య,ప్రజా స్వామ్య పరిరక్షకులు దేశ భక్తులని అభిప్రాయ పడ్డారు. ఈ దేశం నాకేమిచ్చిం ది కాకుండ ఈ దేశానికి నేనేమీ చేశాను అనే ఆలోచనతో ప్రతి భారతీయుడు తమ బాధ్యతలను వజ్ర సం కల్పంతో సక్రమంగా ధర్మబద్ధంగా నిర్వర్తిస్తు దేశ భక్తిని పెంచుకొని స్వాతంత్ర్య పలాలను తమతో పాటు భావితరాలు కు అందించాలన్నారు.