బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని మోస్రా, చందూరు మండలాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి

జులై 22, 2022
బాన్సువాడ (కామారెడ్డి జిల్లా).
బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని మోస్రా, చందూరు మండలాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బాన్సువాడ పట్టణంలోని సరస్వతి దేవాలయం ఫంక్షన్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించిన శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ…
బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, నాయకులు సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.
క్షేత్ర స్థాయిలో పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడంలో  గ్రామ స్థాయిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు కీలకం.
గ్రామ స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి.
తద్వారా  మనస్పర్థలకు ఆస్కారం ఉండదు.
ఏకపక్ష నిర్ణయాలు వద్దు
తెలంగాణ రాష్ట్రానికి పరిపాలన దక్షత కలిగిన ముఖ్యమంత్రి ఉన్నారు.
అభివృద్ధి కోసం కావలసినన్ని నిధులను మంజూరు చేస్తున్నారు.
ప్రతి గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక తయారు చేసుకోవాలి.
వీటితో పాటుగా సామాజిక వివరాలను కూడా సేకరించాలి.
 పాల్గొన్న మండల ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు.