బాపూజీకి ఘన నివాళి
– అసెంబ్లీ ఆవరణంలో నివాళులర్పించిన స్పీకర్, మండలి చైర్మన్
హైదరాబాద్, జనవరి30(జనంసాక్షి) : జాతిపిత మహాత్మాగాంధీ 71వ వర్థంతి సందర్భంగా బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనినాస్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ నివాళులర్పించారు. గాంధీ చిత్రపటం వద్ద పూలు పెట్టి ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క సహా అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గాంధీ మార్గంలోనే దేశం ముందుకు వెళ్తుందన్నారు. మహాత్ముని మార్గం శాంతి మార్గమని తెలిపారు. గాంధీ బాటలోనే నడుస్తూ పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ యాదిలో మనమంతా శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. విద్యార్థులు, యువత మహాత్ముని మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. బాపూజీకి నివాళులర్పించిన వారిలో ¬ంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ బండారు దత్తాత్రేయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎమ్మెల్సీ పొంగులేటి, నగర మేయర్ బొంతు రామ్మోహన్లు ఉన్నారు.