బాబునవనిర్మాణ దీక్షలు ఎందుకో
ప్రతిపక్షాలను తిడితే సమస్యలు సమసిపోతాయా?
ఏవిూ చేయలేక ఎదురుదాడి చేస్తారా: మధు
నెల్లూరు,జూన్5(జనం సాక్షి):తెలుగుదేశం పార్టీ చేపట్టిన నవ నిర్మాణ దీక్షలు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని సీపీఎం నేత మధు విమర్శించారు. నాలుగేళ్లు అధికార బిజెఇపతో అంటకాగిన బాబు ఇప్పుడు దీక్షల పేరుతో ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మితివిూరిన అహంకారం ప్రదర్శిస్తోందని అన్నారు. ఏపీకి కేంద్రం ఎంత అన్యాయం చేసిందో… టీడీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అంతే అన్యాయం చేసిందని మధు తీవ్రస్థాయిలో విమర్శించారు.ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు నవనిర్మాణ దీక్ష పేరుతో ఎపి ప్రజలను వంచన చేస్తున్నారని పి.మధు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణదీక్షా ఎందుకోసం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా సిపిఎం కార్యలయంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నవనిర్మాణ దీక్షా ప్రతిపక్షాలను తిట్టడం కోసమే ముఖ్యమంత్రి చేపట్టారని ఆయనవిమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత మోసం చేసిందో అంతే మోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వామపక్షాలు పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీన ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు ఆందోళనలు చేపడతామని ఈ ఆందోళనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.