బాబు ఆస్తులు ప్రకటించుకున్నారు

తాను గరీబు .. కుటుంబ సభ్యులే అమీరు
కుటుంబ ఆస్తులు రూ.35.59 కోట్లు శ్రీతన ఆస్తులు కేవలం 31.97 లక్షలే నట !
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13(జనంసాక్షి):
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనతో పాటు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రహ్మణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను విూడియాకు వెల్లడించారు. ఏటా తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించాలని నిర్ణయించుకున్నారని, అందుకే ఈ ఏడాది కూడా ఆస్తులను ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత ఏడాది కూడా చంద్రబాబు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనలాగే మిగతా రాజకీయ నాయకులు కూడా ఆస్తులను ప్రకటించాలని సూచించారు. తాను ఆస్తులను ప్రకటించిన తరువాతే కేంద్ర మంత్రివర్గంలో చలనం వచ్చిందని బాబు చెప్పారు. కొందరు నాయకులు రాజకీయాలను స్వార్ధంకోసం వాడుకొని ఆస్తులను కూడబెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ. 35.59 కోట్లు ఉంది. చంద్రబాబు ఆస్తుల విలువ 31.97 లక్షలు రూపాయలు
ఉండగా, భార్య భువనేశ్వరి ఆస్తుల విలువ 24.57 కోట్లు రూపాయలు ఉంది. తన పేరు విూద ఇల్లు, కారు ఉందని చంద్రబాబు చెప్పారు. కాగా, నారా లోకేష్‌ ఆస్తుల విలువ రూ. 6.62 కోట్ల రూపాయలు ఉంది. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ. 2.09 కోట్లు ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని, తాను కాపాడుకుంటున్నానని ఆయన చెప్పారు. తన పిల్లలు మంచి చదువులు చదువుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారని, అయినా తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వారి ఆస్తుల వివరాలు కూడా వెల్లడిస్తున్నానని ఆయన అన్నారు. కొంత మంది రాజకీయాలను స్వార్థం కోసం వాడుకుని కోట్లు సంపాదిస్తున్నారని ఆయన విమర్శించారు. పిల్లలకు డబ్బులు ఇవ్వడం కన్నా వారికి మంచి చదువులు చెప్పించాలని ఆయన అన్నారు. హెరిటేజ్‌ సంస్థల ద్వారా తన కుటు-ంబ సభ్యులు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. వ్యాపారాలు నీతినిజాయితీలతో చేయవచ్చు, దోచుకోవడానికి చేయవచ్చునని, తన కుటుంబ సభ్యులు నీతినిజాయితీలతో వ్యాపారాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు రెండు ఎకరాలు, రెండు వేల కోట్లు అంటూ తనపై దుష్పచ్రారం చేస్తున్నారని ఆయన అన్నారు. తన పార్టీకి ఖర్చుల కోసం కూడా నిధులు లేవని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవడం తప్పు కాదని ఆయన అన్నారు. అవినీతి కార్యకలపాలు 70 శాతం మన రాష్ట్రంలోనే సాగుతున్నాయని, మన రాష్ట్రంలోని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే దేశంలోని అవినీతిపై పోరాటం చేసినట్లేనని ఆయన అన్నారు. తన కుమారుడు నారా లోకేష్‌ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పడాన్ని ఆయన ఆహ్వానించారు. కార్యకర్తగా ఎవరైనా పనిచేయవచ్చునని ఆయన అన్నారు. తన భార్య నిర్వహిస్తున్న వ్యాపారాలకు ఎక్కడా ప్రభుత్వ భూమిని తీసుకోలేదని, ఇతర విధాలుగా లబ్దిపొందలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు సింగపూర్‌లో ¬టల్స్‌ ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తు ఆ ఆరోపణలు చేస్తున్నవారు వాటిని రుజువు చేయాలని సవాల్‌ విసిరారు.