బాబ్లీపై తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా
ఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబరు 8కి వాయిదా వేసింది. 2.74 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని ఆధారాలు సమర్పించాలని మహారాష్ట్రకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 37 ఏళ్ల గణాంకాలను పట్టిక రూపంలో ఇవ్వాలని. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో వాదించింది.