బాబ్లీపై మహారాష్ట్రను తప్పుబట్టిన సుప్రీం
న్యూఢిల్లీ, అక్టోబర్ 10 (జనంసాక్షి):బాబ్లీ సాగునీటి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం మొట కాయ వేసింది. ప్రాజెక్ట్ విషయంలో ఆ రాష్ట్ర వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. బాబ్లీ వివాదంపై ప్రాథమిక విచారణను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం పూర్తిచేసింది. మహారాష్ట్ర వైఖరి ఫలి తంగా బాబ్లీ వివాదం తలెత్తిందని పేర్కొంది. గురువారం దీనికి సంబంధించిన తుది వాదనలు జరగనున్నాయి. బుధవారం వాదనల సందర్భం గా గోదావరి జలాల పంపకం, వినియోగంపై ఉమ్మడి పర్యవేక్షణ సెల్ ఏర్పాటుకు అంగీకరి స్తున్నారా లేదా అంటూ ప్రశ్నించిందిబాబ్లీ లేని పక్షంలో తాగునీటి అవసరాల కోసం మహారాష్ట్రకు 1.09 టీఎంసీల నీరు ఇచ్చేందుకు ఏపీ సిద్ధంగా ఉందని మన రాష్ట్ర న్యాయవాది కోర్టుకు తెలియచేశారు. సాగునీటి కోసం కాకుండా కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందిన మహారాష్ట్ర తెలిపింది. మరోవైపు బాబ్లీ గేట్ల ఎత్తును 3.5 మీటర్ల మేర తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కానీ గేట్ట ఎత్తు తగ్గింపుపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి స్పందిస్తామని ఏపీ న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానానికి తెలియచేశారు. గేట్ల ఎత్తు తగ్గింపుపై వైఖరిని గురువారం తెలియచేస్తామని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న ప్రాజెక్ట్‌ను ఖచ్చితంగా నిలిపివేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌తో రాజీ కుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర స్పష్టం చేసింది. బాబ్లీపై ఇప్పటికే 200 కోట్ల రూపాయలను ఖర్చు చేసామని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి గురువారం తుది వాదనలు జరగనుండగా, తుది తీర్పు సైతం అదే రోజు వేల్లడయ్యే అవకాశం ఉంది.