బాబ్లీ ప్రాజెక్టుపై ముగిసిన వాదనలు
ఢిల్లీ: వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలు తమ వాదనలు వినిపించాయి. ఇరు. రాష్ట్రాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. గోదావరి నది జలాల వివరాల సంక్షిప్త నివేదిక రెండు వారాల్లో అందజేయాలని మహారాష్ట్రను కోర్టు ఆదేశించింది. కేంద్ర జలసంఘం నిబంధనలకు అనుగుణంగానే గోదావరి నీటిని వాడుకుంటున్నట్లు మహారాష్ట్ర తెలిపింది. గోదావరి టైబ్యునల్ ఆదేశాలు ప్రకారమే నీటిని వాడుకుంటున్నామని మహారాష్ట్ర మహారాష్ట్ర మరోసారి కోర్టుకు తెలిపింది. గోదావరి ట్రైబ్యునల్ నిర్ధారించిన 60 టీఎంసీలకు మించి ఒక్కచుక్క కూడా వాడుకోవడం లేదని మహారాష్ట్ర పేర్కొంది.