బార్‌కోడ్ విధానంలో పుస్తకాల పంపిణీ
సిద్దిపేట,మే31(జనం సాక్షి): ఈ యేడు విద్యాసంవత్సరం జూన్ 1నుంచి ప్రారంభం కానున్నది. జిల్లా మొత్తంలో 975 పాఠశాలల్లో సుమారు 80,824 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాకు 5,93,070 పాఠ్యపుస్తకాలు రాగా, గత విద్యాసంవత్సరానికి సంబంధించినవి 21,900 ఉన్నాయి. మొత్తం కలిపి 6,14,970 పాఠ్యపుస్తకాలు జిల్లాకు వచ్చాయి. వీటిలో 2018 -19 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 975 పాఠశాలలకు పంపిణీ చేశారు. 1 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థుల సంఖ్య 63,040 మంది ఉన్నారు. కేజీవీబీ పాఠశాలల్లో 2,513 విద్యార్థులు, మోడల్ స్కూల్లో 4,029 మంది విద్యార్థులకు సంబంధించి ఆయా పాఠశాలలకు 5,25,088 పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఆయా మండలాలకు పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగింది. అక్కన్నపేటకు 14,490, బెజ్జంకి 14,671, చేర్యాల 25,201, చిన్నకోడూరు 21,885, దౌల్తాబాద్ 21,768, దుబ్బాక 41,120, గజ్వేల్ 39,197, హుస్నాబాద్ 19,336, జగదేవ్‌పూర్ 25,881, కోహెడ 21,103, కొమురవెల్లి 7,049, కొండపాక 24,743, మద్దూరు 19,667, మర్కూక్ 19,941, మిరుదొడ్డి 23,712, ములుగు 30,547, నంగునూరు 20,869, రాయిపోల్ 18,830, సిద్దిపేట రూరల్ 23,008, సిద్దిపేట అర్బన్ 47,945, తొగుట 18,694, వర్గల్ 25,431 పాఠ్యపుస్తకాలు ఆయా మండలాలకు పంపిణీ చేయగా మండల కేంద్రాల నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి వారి పాఠశాలలకు తీసుకెళ్లారు. ఈ సారి పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా బార్ కోడ్ సిస్టాన్ని ప్రవేశపెట్టారు. 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 65,687 జతల యూనిఫామ్స్ పంపిణీ చేశారు.