బాలలను పనిలో పెట్టుకుంటే శిక్షలు కఠినం : దత్తాత్రేయ

44న్యూఢిల్లీ: బాలకార్మిక వ్యవస్థ చట్టసవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బాలలను పనిలో పెట్టుకునేవారికి శిక్షలు కఠినతరం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులకు సైతం జరిమానా విధిస్తామని తెలిపారు. నష్టపరిహారం కింద ఫండ్ ఏర్పాటు చేసి విడుదలైన బాలకార్మికుల పేరు మీద రూ.15వేలు డిపాజిట్ చేస్తామని ఆయన చెప్పారు. కొత్తచట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలూ బాధ్యత తీసుకోవాలని దత్తాత్రేయ కోరారు.