బాలల పరిరక్షణ కమిటీలు మరింత బలోపేతం చేద్దాం జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజు కుమార్
మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి )
మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బాల రక్షా భవన్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజు కుమార్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన బాలల పరిరక్షణ కమిటీలను మరింత బలోపేతం చేయాలని,0నుండి18 సంవత్సరాల లోపు వయస్సుగల వారిని బాలలు అంటారని, బాలలకు ఏదైనా అన్యాయం జరిగితే 1098 టోల్ ఫ్రీ నెంబర్,యువకుల కోసం 181 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే సరిపోతుందని అన్నారు.గ్రామాలలో బాల్య వివాహాలు జరుగకుండా చూడాలని,అక్రమ దత్తత చెల్లనేరదని అన్నారు.సమాజంలో మానవత్వం విలువలు లేకుండా స్వార్ధం సమాజంలో పెరిగిపోయిందని,బాలల రక్షణ పరిరక్షణ బాధ్యత మనందరిదీ ని,సమాజం చైతన్యమైతే బాల్య వివాహాలు జరిగే ఆస్కారం ఉండదని,మూఢనమ్మకాలు లేని సమాజం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ న్యాయ సేవా అధికారి షేక్ మోహిమోద్దీన్, గ్రామ సర్పంచ్ శ్రీపతి బాపు .ఉపాధ్యాయులు రాజ్ నాయక్,పంచాయతీ పారిశుధ్య స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య,సామాజిక కార్యకర్తలు,హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య,అంగన్వాడీ టీచర్లు,బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు