బాలల హక్కులను ప్రతి ఒక్కరు గౌరవించాలి గ్రామ సర్పంచి మైలగానీ బాలకిష్టమ్మ

లింగాల జనం సాక్షి ప్రతినిధి

బాలల హక్కులను గౌరవించాలని గ్రామ సర్పంచి మైలగానీ బాలకిష్టమ్మ అన్నారు. శుక్రవారం లింగాల మండల పరిధిలోని .రాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచి మైలగానీ బాలకిష్టమ్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ పాఠశాలలో ఉండాలని, ఎవరు కూడా డ్రాప్ ఓటు కాకుండా తల్లిదండ్రులు చూడాలని, ప్రభుత్వం పిల్లల కోసం ఎన్నో సంక్షేమ హాస్టళ్లను నెలకొల్పింది, బడిబయట ఎవరు కూడా పిల్లలు ఉండరాదని అందరు పాఠశాల ఉండాలని , 18 సంవత్సరాల పైబడి నా బాలికలకు మాత్రమే వివాహాలు చేయాలని, అంతలోపు ఎవరు కూడా చేయరాదని కోరారు. పుట్టిన ప్రతి శిశువు గ్రామపంచాయతీలో 21 రోజుల లోపు పుట్టిన ప్రతి శిశివు పేరు నమోదు చేసి సర్టిఫికెట్ పొందాలని కోరారు, వివాహాలు చేసుకునే ముందు గ్రామపంచాయతీలో నమోదు చేయాలని. తదితర విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రేమ్,అంగన్వాడీ టీచర్ కన్వీనర్ పుష్పాలత ,స్కూల్ టీచర్ సభ్యులు శ్వేతా రాణి.ఎస్ ఎం సీ చెర్మెన్ యాదగిరి.
ఆశ వర్కేర్ మంజుల.యూత్ సభులు మహేష్.చిల్డ్రన్ క్లబ్ మెంబెర్స్ మాధవి
ఎస్ వి కే యన్ జి ఓ శ్రీనివాసులు
పిల్లల తల్లిదండ్రులు భాస్కర్, సింగిల్ విండో డైరెక్టర్ చంద్రయ్య, వీఆర్ఏ వెంకటేష్,
తదితరులు పాల్గొన్నారు.