బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు


ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రావు
భువనగిరి,అగస్టు24(జనంసాక్షి): ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ జె.శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం భువనగిరిలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల అదాలత్‌ కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ విషయంలో సమస్యలను గుర్తించి అక్కడిక్కకడే పరిష్కారానికి కమిషన్‌ చర్యలు తీసుకుంటుందన్నారు.
ªూష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి కమిషన్‌ చేరుకుని బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నదని ఈ విష యంలో జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నదన్నారు. బాలల హక్కుల పరిరక్షణ విషయంలో పోలీసు, విద్యాశాఖల పాత్ర కీలకమని, బాల్య వివాహాల నిర్మూలన, వెట్టిచాకిరి నుంచి విముక్తి తదితర చర్యలు చేట్టాలని ఆయా శాఖాలకు సూచించారు. బాలల బాగోగుల విషయంలో ప్రతి ప్రభుత్వ శాఖకు బాధ్యత ఉంటుందని అన్నారు. అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా గత సంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు అన్ని పాఠశాలలు, కళాశాలలు, మూతబడి విద్యారంగానికి, విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని, బాల అదాలత్‌ విద్య, వైద్య శాఖల ద్వారా పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు బాల అదాలత్‌ న్యాయం చేకూరుతుందని అన్నారు. బాల అదాల త్‌లో తల్లిదండ్రుల, బాలల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరిస్తారని చెప్పారు. డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ పిల్లల విషయంలో తల్లిదండ్రుల తరపున అన్యాయం జరిగనచో రాచకొండ పోలీస్‌ కమి షన్‌ పరిధిలో సత్వరమే స్పందించి పోలీస్‌శాఖ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. అవసరమైతే జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమో దు చేసి ఇన్వెస్టిగేషన్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. ముస్కాన్‌ ఆపరేషన్‌ ద్వారా వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో వెట్టి చాకిరి నుంచి దాదాపు 300లకు పైగా పిల్లలకు విముక్తి కల్పించామన్నారు. బాలల భవిష్యత్‌కు పోలీస్‌శాఖ అన్ని చర్యలు చేపడుతుందన్నారు. సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు బండి అపర్ణ, అంజన్‌రావు, చిట్టిమల్ల రాగజ్యోతి, శోభారాణి, బృందాకర్‌, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జిల్లా విద్యా శాఖాధికారి చైతన్యజైనీ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, సీడీపీవోలు, జిల్లా బాలల పరిరక్షణ
అధికారి సైదులు, తదితరులు పాల్గొన్నారు.