బాలసదన్‌ బాలికల ధర్నా

మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌లోని బాలసదన్‌లో వార్డెన్‌ మద్యం తాగి తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బాలికలు తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేశారు. మద్యం తాగి వేధిస్తున్న వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాలికలు డిమాండ్‌ చేశారు. ఈ సంధర్భంగా తహసీల్దారు బాలికలతో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని హామీ ఇచ్చారు.